పాడేరు: వైద్యారోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా వ్యాప్తంగా ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అన్నారు. పల్స్‌పోలియో నిర్వహణపై బుధవారం జిల్లా అధికారులతో టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 0–5 సంవత్సరాల పిల్లలు 85,676 మంది ఉన్నారని, వారిందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆదేశించారు. పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులతో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. గ్రామ సచివాలయ, వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో దండోర, మైక్ ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 875 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పారు. ప్రతి చిన్నారి–ప్రతి బూత్– ప్రతి చుక్క ఎంతో విలువైనది అనే నినాదాన్ని పల్స్‌పోలియో మార్గదర్శక సూత్రంగా పాటించాలన్నారు. అనంతరం పల్స్‌పోలియో బ్యాన ర్‌ను ఆవిష్కరించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్, డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌రావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్, డీఆర్డీఏపీడీ మురళి పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ


