ఆదివాసీల సంపదను దోచుకోనివ్వం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల సంపదను దోచుకోనివ్వం

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

అనంతగిరి(పాడేరు రూరల్‌): ప్రాణాలైనా ఇస్తాంగానీ ఆదివాసీల అటవీ సంపదను దోచుకోనివ్వబోమని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. బుధవారం అనంతగిరి మండలంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. బాకై ్సట్‌ పై రాజకీయ పార్టీల అభిప్రాయలను వెల్లడించాలన్నారు. గిరిజన ప్రాంతంలో నిక్షిప్తమైన ఉన్న బాకై ్సట్‌ ఖనిజ సంపదపై రాజకీయ పార్టీల వైఖరి ప్రకటించాలన్నారు. చింతపల్లి ఏరియాలో బాకై ్సట్‌ నమూనాలను రహస్యంగా సేకరించి తరలించడంపై తీవ్రంగా అభ్యంతరం చేస్తున్నట్టు చెప్పారు. గిరిజన ప్రాంతంపై అన్ని హక్కులు ఆదివాసీలకే ఉంటాయని, ఖనిజ సంపదను దోచుకోవడం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని ఆరోపించారు. ఆదివాసీ మహిళలు కట్టెలకోసం అడవికి వెళ్తే కేసులు పెట్టే అధికారులు, ఆదివాసీల సంపదనే దోచుకునే ప్రయత్నం చేస్తున్న దొంగలను ఎందుకు విడిచి పెడుతున్నారని ప్రశ్నించారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు బాకై ్సట్‌కు వ్యతిరేకంగా టీఏసీ తీర్మానం చేశామని గుర్తు చేశారు.

మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement