శారదానదిలో బాలుడు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

శారదానదిలో బాలుడు గల్లంతు

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

కశింకోట: మండలంలోని అమీన్‌సాహెబ్‌పేట వద్ద శారదానదిలో మిత్రులతో పాటు కలసి సరదాగా స్నానానికి దిగిన యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... యలమంచిలి మండలం వెంకటాపురానికి చెందిన వీసం చందు (16), మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి వారితో పాటు ఎఎస్‌ పేట వద్ద శారదా నదిలో స్నానానికి దిగాడు. ఈత రాక నదిలో మునిగి గల్లంతయ్యాడు. ఈ మేరకు అందిన సమాచారంపై సంఘటనా స్థలాన్ని సందర్శించి ముమ్మరంగా నవీన్‌చంద్ర ఆచూకి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement