మాట్లాడుతున్న డీఐఈవో వినోద్ బాబు
మాడుగుల: కళాశాలలో మెరుగైన విద్య అందించాలని అనకాపల్లి జిల్లా డీఐఈవో మద్దిల వినోద్‌బాబు అన్నారు. స్థానిక జూనియర్ కళాశాలను ఆయన బుధవారం అకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో అడ్మిషన్‌లు పెంచాలన్నారు. 2026 మార్చిలో అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షల్లో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలవగా మాడుగుల ప్రత్యేక స్థానం దక్కించుకుందున్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులు సిబ్బందికి ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఆయన వెంట జిల్లా సూపరింటెండెంట్ సుధాకర్, యూడీసీ శ్రీనివాస్, కళాశాల సిబ్బంది తదితరులున్నారు.


