కశింకోట: కశింకోటకు చెందిన కథా రచయిత బొడ్డేడ బలరామస్వామి రాసిన ‘మొక్కు’ కథ జాతీయ స్థాయి కథల పోటీలో వరుసగా మూడోసారి తృతీయ బహుమతి లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహించిన 2026 కథల పోటీ ఫలితాలను బుధవారం ప్రకటించగా బహుమతి వచ్చినట్లు బలరామస్వామి తెలిపారు. ఈ మేరకు పది వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో వచ్చే నెల 19,న జరిగే కార్యక్రమంలో బహుమతిని అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో 2024లో డేగ, 2025లో తోడపెద్దు కథలకు తృతీయ బహుమతులు వచ్చాయన్నారు. సాహితీవేత్తలు, స్థానిక పెద్దలు బహుమతి పొందిన బలరామస్వామిని అభినందించారు.


