అనకాపల్లి : విశాఖ–విజయవాడ స్థానిక అనకాపల్లి శారదనది బ్రిడ్జి రైల్వే ట్రాక్‌పై సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తి గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. మృతుడు నల్లరంగు పుల్‌హ్యాండ్స్ చొక్కా, ఎర్ర రంగు బనియాన్, నలుపురంగు ఫ్యాట్ ధరించి ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. వివరాలకు సెల్ నంబర్ 7382058996 ను సంప్రదించాలన్నారు.


