గిరిజన యువతి జాతీయ స్థాయి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

గిరిజన యువతి జాతీయ స్థాయి ప్రతిభ

Jun 25 2026 1:06 AM | Updated on Jun 25 2026 1:06 AM

● మొదటి ప్రయత్నంలోనే పుదుచ్చేరి జేఐపీఎంఈఆర్‌లో ఎండీ గైనకాలజీ సీటు ● కిలగాడ గిరిజన యువతీకి అభినందనల వెలువ..

ముంచంగిపుట్టు : న్యూఢిల్లీ ఎయిమ్స్‌ నిర్వహించిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఐఎన్‌ఐ–సెట్‌)–2026 జూన్‌ సెషన్‌ ఫలితాలలో ముంచంగిపుట్టు మండలం కిలగాడ గ్రామానికి చెందిన గిరిజన యువతీ డాక్టర్‌ చిట్టపులి శ్రావ్య దీప్తి ప్రియాపడాల్‌ ప్రతిభ కనబర్చింది.అఖిల భారత స్థాయిలో 6,436వ ర్యాంకు,కేటగిరీ ర్యాంకులో 38వ స్థానం సాధించారు.దీంతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక వైద్య విద్యాసంస్థలలో ఒకటైన జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(జేఐపీఎంఈఆర్‌) పుదుచ్చేరిలో ప్రసూతి, సీ్త్రరోగ విభాగంలో(ఎం.డి.గైనకాలజీ)లో సీటును మొదటి ప్రయత్నంలోనే కై వసం చేసుకుంది. కిలగాడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు చిట్టపులి శ్రీనివాస్‌పడాల్‌,కృష్ణకుమారి దంపతుల ద్వితీయ కుమార్తె శ్రావ్య దీప్తి ప్రియా పడాల్‌.10వ తరగతి వరకు పాయకరావుపేటలోని శ్రీప్రకాశ్‌ విద్యానికేతన్‌,ఇంటర్మీడియెట్‌ అంత విశాఖలోని శ్రీచైతన్యలో,2019లో నీట్‌–యూజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి,విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ప్రవేశం పొంది, 2025లో వైద్య విద్యను పూర్తి చేశారు.గిరిజన ప్రాంతానికి చెందిన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి యువతీ శ్రావ్య దీప్తిప్రియాపడాల్‌ ఈ స్థాయికి చేరుకోవడం యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని,భవిష్యత్తులో వైద్య సేవా రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కిలగాడ గ్రామానికి చెందిన ఉద్యోగులు,ఉపాధ్యాయులు,నేతలు,ప్రజలు, మండల వాసులు అభినందనులు తెలియజేస్తూ,ఆకాంక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement