విశాఖ స్పోర్ట్స్: ఏసీఏ అండర్–16 మల్టీడే అంతర జిల్లాల నార్త్‌జోన్ క్రికెట్ పోటీల్లో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 596 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన తూర్పుగోదావరి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగులకే ఆలౌటైంది. విశాఖ బౌలర్లలో యతీష్ మూడు వికెట్లు పడగొట్టగా, రామ్‌చరణ్, లోహిత్, భాను తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విశాఖ జట్టు 6 వికెట్ల నష్టానికి 749 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ చైతన్య 82 పరుగులు చేయగా, గణేష్‌కృష్ణ 210 పరుగులతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. రామ్‌చరణ్ (119), రుత్విక్ (నాటౌట్ 100) సెంచరీలతో రాణించగా, చెరిష్‌వర్ధన్ 86 పరుగులు చేశాడు.భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తూర్పుగోదావరి జట్టు 92 పరుగులకే ఆలౌటైంది. మణివర్ధన్ 54 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. విశాఖ బౌలర్లలో లోహిత్ నాలుగు వికెట్లు, భాను మూడు వికెట్లు, యతీష్ రెండు వికెట్లు పడగొట్టారు.దీంతో విశాఖ జట్టు ఇన్నింగ్స్ 596 పరుగుల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.


