చీడికాడ: మండలంలోని ఖండివరం గ్రామం మెయిన్‌రోడ్డును ఆనుకుని ఉన్న మోదమాంబ పాదల నుంచి ఖండవరం, ఎల్.బి.పట్నం గ్రామాలకు చెందిన సూమారు 50 కళ్లాలకు వెళ్లే మార్గంలో ఆక్రమణలను బుధవారం తొలగించి రెవెన్యూ అధికారులు సరిహాద్దులు వద్ద రాళ్లు పాతించారు. ఈ రహదారిని ఖండివరం గ్రామానికి చెందిన గండి సూర్యనారాయణ అనే నాయకుడు ఆక్రమించుకుని ఆ మార్గంలో వెళ్లే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు గత సోమవారం పీజీఆర్‌ఎస్‌లో బాధిత రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గత గురువారం సాయంత్రం తహసీల్దార్ కిషోర్ లింకన్ ఆక్రమణ గురైన వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. రికార్డుల ప్రకారం అది ప్రభుత్వం స్థలమని నిర్ధారించారు.అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.ఈ మేరకు బుధవారం మండల సర్వేయర్ సురేష్, వీఆర్‌వో అర్జునరావు, రైతులు, గ్రామపెద్దలు సి.డి.సి చైర్మన్ సుంకర శ్రీనువాసరావు, కో–ఆపరేటివ్ మాజీ అధ్యక్షుడు మోసూరి సన్నిబాబు, మండల కో–ఆప్సన్ మెంబర్ షేకు సూర్యనారాయణలు, వేచలపు కామేశ్, అమ్మతల్లినాయుడు సమక్షంలో సర్వే రాళ్లు పాతారు.


