చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్‌కు భార్య కోమలి, ముగ్గురు చిన్నారి ఆడపిల్లలు ఉన్నారు. గతంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన వెంకటేష్, అది మూతపడటంతో ఐదు నెలల క్రితమే ఈ పరిశ్రమలో చేరాడు. తన ముగ్గురు కూతుళ్లను బాగా చదివించుకోవాలని ఆశపడ్డ ఆ తండ్రి, ఇలా మంటల్లో కలిసిపోవడంతో.. ‘ఇక మాకు దిక్కెవరు?’ అంటూ ఆ భార్యాపిల్లలు చేస్తున్న రోదనలు అక్కడున్న వారి గుండెలను పిండేశాయి.
రోదిస్తున్న వెంకటేష్ భార్య కోమలి


