డీఎంహెచ్‌వోపై వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదు
విచారణ జరిపిన అడిషనల్ డైరెక్టర్ అనిల్
సాక్షి, పాడేరు: జిల్లాలోని కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు, సీహెచ్‌వోలు, ఎంఎల్‌హెచ్‌పీల నుంచి డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్, ఇతర సిబ్బంది బాండ్లు రెన్యువల్‌కు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అందిన ఫిర్యాదు మేరకు అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ సోమవారం విచారణ జరిపారు. ఫిర్యాదు చేసిన 300 మంది పాడేరులో నిర్వహించిన విచారణకు హాజరయ్యారు. బాండ్లు రెన్యువల్‌కు సంబంధించి ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి వరకు వసూళ్లు చేసినట్టు వారంతా అడిషనల్ డైరెక్టర్‌కు పలు ఆధారాలతో వివరించారు. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్, డీఎంహెచ్‌వో కార్యాలయంలోని పలువురు సిబ్బందిని అడిషనల్ డైరెక్టర్ సమగ్రంగా విచారించారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని కాంట్రాక్టు వైద్య ఉద్యోగులను మంగళవారం రంపచోడవరం ఐటీడీఏ ఆవరణలో అడిషనల్ డైరెక్టర్ విచారించనున్నారు.


