ఘాట్‌రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్‌ | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్‌

Jun 23 2026 1:16 AM | Updated on Jun 23 2026 1:16 AM

సాక్షి, పాడేరు: ఘాట్‌లోని ఏనుగురాయి సమీపంలోని ఇరుకై న మలుపు వద్ద ఆదివారం అర్ధరాత్రి భారీ లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. మైదాన ప్రాంతాల నుంచి లోడ్‌తో పాడేరు వస్తున్న లారీ సాంకేతిక కారణంతో ఆకస్మికంగా నిలిచిపోవడంతో ఉదయం వరకు ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మైదాన ప్రాంతాలకు రవాణా స్తంభించింది. వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయాన్నే పోలీసులు, పలు విభాగాల సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకుని లారీని అక్కడ నుంచి తొలగించే పనులు చేపట్టారు. ఉదయం 8గంటలు దాటిన తరువాత ఘాట్‌లో ఇరువైపులా వాహనాలు నడిచాయి.

రోడ్డుకు అడ్డంగా తిరిగిన లారీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement