మాడుగుల రూరల్: మండలంలోని శివారు గిరిజన గ్రామాల్లో సారా బట్టీలుపై దాడులు చేసి, పది లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, 800 లీటర్లు బెల్లం పులుపును ధ్వంసం చేసినట్లు మాడుగుల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టరు ఎల్. ఉపేంద్ర సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అల్లూరు జిల్లా సరిహద్దులో మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీ బిళ్లలపాలెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో సారా బట్టీలపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో సారా స్వాధీనం చేసుకుని, బెల్లం పులుపుతోపాటు వంటపాత్రలు ధ్వంసం చేశామన్నారు. బిళ్లలపాలెం గ్రామానికి చెందిన పళ్లేజు కొండమ్మ, పాడేరు మండలం అర్జాపురం, ఓబర్తి గ్రామాలకు చెందిన జోడి రాజు, జన్ని ఈశ్వరరావు, మడక జగ్గారావులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. విచారణలో నల్లబెల్లం తయారుదారుపై కేసు నమోదు చేశామని, త్వరలో అతడిని అరెస్టు చేస్తామన్నారు. ఈ దాడుల్లో సీఐతోపాటు ఎస్‌ఐ కె. శ్రావణి, హెచ్‌సీలు కె. అప్పలనాయుడు, ఎం. గురునాయుడు, సిబ్బంది ఆనంద్, విజయ, కనకరాజు, పాల్గొన్నారు.


