బాకై ్సట్‌ గుబులు | - | Sakshi
Sakshi News home page

బాకై ్సట్‌ గుబులు

Jun 22 2026 12:54 AM | Updated on Jun 22 2026 12:54 AM

గూడెం గుండెల్లో..
ఏజెన్సీలో గిరిజనుల ఆత్మగౌరవానికి, జీవనాధారానికి ప్రతీకగా ఉన్న బాకై ్సట్‌ నిక్షేపాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు గిరిజన ఉద్యమాలకు కేంద్ర బిందువైన బాకై ్సట్‌ తవ్వకాల భూతం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే మళ్లీ గిరిజన గూడేలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం రహస్యంగా చేపడుతున్న సర్వేలు, ఆపరేషన్లు ఇప్పుడు గిరిజనులను రోడ్డెక్కేలా చేశాయి. గిరిజనుల అనుమతి లేకుండా, వారి ఆమోదం లేకుండా ఏజెన్సీలో అడుగుపెట్టే ఏ ప్రయత్నాన్ని అయినా అడ్డుకుని తీరుతామని ప్రజా సంఘాలు, వైఎస్సార్‌సీపీ హెచ్చరిస్తున్నాయి.

ఏజెన్సీని వణికిస్తున్న బాకై ్సట్‌ భూతం

ప్రశాంతంగా ఉన్న మన్యంలో చిచ్చు రగులుస్తున్న కూటమి ప్రభుత్వం

వెనక్కి తగ్గకుంటే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరిస్తున్న గిరిజనం

పాడేరు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అంటే విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, కట్టుబాట్లు, ప్రత్యేక జీవన విధానం, అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. ప్రశాంతతకు మారుపేరైన ఈ గిరిజన గూడేలను ఇప్పుడు బాకై ్సట్‌ తవ్వకాల భూతం భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని గూడెంకొత్తవీధి, చింతపల్లి, అనంతగిరి మండలాల్లో విలువైన బాకై ్సట్‌ నిక్షేపాలు ఉన్నాయి. ఈ సంపదను కొల్లగొట్టేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా, గిరిజనులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల పోరాటంతో తవ్వకాలను అడ్డుకుంటూ వస్తున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అప్పటి సీఎం చంద్రబాబు బాకై ్సట్‌ తవ్వకాల కోసం జీవో నంబరు 97ను జారీ చేయడంతో ఏజెన్సీలో నిరసన జ్వాలలు మొదలయ్యాయి. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చింతపల్లి వేదికగా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాకై ్సట్‌ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, 2019లో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జగన్‌మోహన్‌రెడ్డి ఆ జీవోను రద్దు చేసి గిరిజనులకు అండగా నిలిచారు.

కొత్త ప్రభుత్వం, పాత కుట్రలు

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాకై ్సట్‌ సంపదపై మళ్లీ కన్ను పడింది. ఈ నెల 17న జర్రెల బ్లాక్‌లోని బాకై ్సట్‌ కొండపైకి ఆరుగురు సభ్యుల బృందం గుట్టుచప్పుడు కాకుండా వచ్చి, బాకై ్సట్‌ శాంపిల్స్‌ సేకరిస్తుండగా గిరిజనులకు పట్టుబడ్డారు. కలెక్టర్‌ అనుమతి ఉందని వారు చెప్పినా, ఎటువంటి అధికారిక ఉత్తర్వులు చూపలేకపోయారు. పోలీసులు వారిని సురక్షితంగా తరలించినా, ఇప్పటికీ ఆ వ్యవహారంపై స్పష్టత ఇవ్వలేదు.

మళ్లీ మొదలైన నిరసనలు

ఈ ఘటనతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. చాపకింద నీరులా బాకై ్సట్‌ దోపిడీకి కుట్ర జరుగుతోందని మండిపడుతున్న గిరిజనులు, మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. గిరిజనులకు అండగా వైఎస్సార్సీపీ నిలబడింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు నేతృత్వంలో స్థానిక నాయకులు బాకై ్సట్‌ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నిరసన ర్యాలీలు చేపట్టారు. వీరికి తోడు జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఏకమై ఆందోళనలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వ తీరును తప్పుపట్టడమే కాకుండా మరో మహోద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యమ కార్యాచరణ కోసం ఆదివారం పాడేరులో కాఫీ హౌస్‌లో అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

బాకై ్సట్‌కు వ్యతిరేకంగా గిరిజన సంప్రదాయ

ఆయుధాలు పట్టిన గిరిజనులు

కొల్లగొట్టే కుట్రలను ఉపేక్షించం

గిరిజనుల జీవితాలతో కూ టమి ప్రభుత్వం ఆటలాడుతోంది. బాకై ్సట్‌ సమస్య పూర్తిగా సద్దుమణిగిందని భావిస్తే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మళ్లీ గిరిజన సంపదను కొల్లగొట్టేందుకు కుటిల యత్నాలు చేస్తోంది. గ్రామసభల అనుమతులు, పీసా కమిటీల తీర్మానాలు లేకుండా ఏ సర్వే బృందాలు, కంపెనీల ప్రతినిధులు ఏజెన్సీలో అడుగుపెట్టడం చట్టవిరుద్ధం. కానీ, రహస్యంగా జర్రెల కొండల్లోకి ప్రవేశించి బాకై ్సట్‌ శాంపిల్స్‌ సేకరిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా లేదా అన్నది కూటమి ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇది గిరిజన హక్కులు, చట్టాలపై జరుగుతున్న తీవ్రమైన దాడి. బాకై ్సట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజన సంఘం తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.

– పి.అప్పలనర్స, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆదివాసీ గిరిజన సంఘం, పాడేరు

గిరిజనుల పక్షానమహోద్యమం

ప్రశాంతంగా ఉన్న గిరిజన ప్రాంతంలో మరోసారి బాకై ్సట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చి, కూటమి ప్రభుత్వం గిరిజనుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. మా ప్రభుత్వ హయాంలో గిరిజనుల మనోభావాలను, స్థానిక పరిస్థితులను అర్థం చేసుకుని జీవో నంబరు 97ను పూర్తిగా రద్దు చేసి, గిరిజనుల పక్షాన నిలబడ్డాం. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాకై ్సట్‌ సంపదను దక్కించుకునేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వారి అక్రమ యత్నాలను మేము చూస్తూ ఊరుకోం. గిరిజనులకు అండగా నిలిచే అందరినీ కలుపుకుని, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మహోద్యమం చేపడతాం.

– మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

గుండెల్లో గునపాలుదించుతాం

తాము అడవిని నమ్ముకొని జీవిస్తున్నాం. అడవే మాము జీవనాధారం. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో మళ్లీ బాకై ్సట్‌ సర్వే కోసం గుట్టుచప్పుడు కాకుండా బృందాలు వచ్చి మా ప్రాంతంలో అలజడి సృష్టించాయి. బాకై ్సట్‌కు వ్యతిరేకంగా గతంలో ఎన్నో పోరాటాలు చేశాం. మళ్లీ బాకై ్సట్‌ జోలికి ఎవరు వచ్చినా వారి గుండెల్లో గునపాలు దించుతాం. మా సంపద మేము కాపాడుకుంటాం.

– సూకూరు చిన్నయ్య,

గునుకురాయి, గూడెంకొత్తవీధి మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement