ముంచంగిపుట్టు : ప్రతి రోజు యోగా సాధనతో మానసిక ప్రశాంతతతోపాటు ఆరోగ్యం సాధ్యమని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. ఆదివారం స్థానిక హోళీ క్రీడా మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఆమెతో పాటు నేతలు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ యోగాతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, రక్త ప్రసరణ పెంచుతుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని, కండరాలను బలోపేతం చేస్తుందన్నారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సైతం యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, ఎస్‌ఐ నాని, సీఆర్‌పీఎఫ్ కంపెనీ కమాండ్ ఇన్‌స్పెక్టర్ పీకే దాసు, ఎంఈవో–2 త్రినాథరావు, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ జగబంధు, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, గణపతి, నబ్బో, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా యోగా దినోత్సవం
సాక్షి,పాడేరు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరకులోయలోని రవ్వలగుడ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా కార్యక్రమాలను కలెక్టర్ టి.నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, జేసీ, ఐటీడీఏ పీవోలు విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి సుమారు రెండు గంటల పాటు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం, యోగాంధ్ర కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన జేసీ, ఐటీడీఏ పీవోతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ నిశాంతి అభినందించి, వారికి జ్ఞాపికలను అందజేశారు.
ముంచంగిపుట్టులో యోగా చేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర,విద్యార్థులు, అధికారులు, నేతలు
యోగాసనాలు వేస్తున్న కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ


