రక్తదానం ప్రాణదానంతో సమానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం ప్రాణదానంతో సమానం

Jun 22 2026 12:54 AM | Updated on Jun 22 2026 12:54 AM

ముంచంగిపుట్టు : రక్తదానం చేస్తే ప్రాణదానంతో సమానమని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. స్థానిక సీహెచ్‌సీలో పోలీసుశాఖ సహకారంతో ఆదివారం వైద్య సిబ్బంది నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. జెడ్పీ చైర్‌ పర్సన్‌తో పాటు ఎస్‌ఐలు నాని, వెంకటేష్‌, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, నేతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వీరికి పండ్లు,గ్లూకోజ్‌ డ్రిక్స్‌ అందించారు. అనంతరం 27 మంది రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయారన్న మాట వినిపించకూడదన్నారు. ,ప్రతి ఒక్కరూ రక్తదానం చేపేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై గిరిజన గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాలని, ముఖ్యంగా సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడు తున్న వారికి నిరంతరం రక్తమార్పిడి అవసరమని అన్నారు. సమాజంలో రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించి, యువతను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయారనే మాటే వినిపించకుండా అందరూ పని చేయాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నీలవేణి, సీహెచ్‌సీ సూపరిటెండెంట్‌ ధరణి, సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ పీకే దాసు, ఎంపీటీసీలు కమల, సుబ్బలక్ష్మి, గణపతి, నబ్బో, ఏవో చంద్రశేఖర్‌, వైద్యులు రమేష్‌, శ్యాంప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, జేసీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ జగబంధు,మాజీ సర్పంచులు రమేష్‌,త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌

జల్లిపల్లి సుభద్ర

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement