అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి హెచ్చరిక
సాక్షి,పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే బాకై ్సట్ తవ్వకాలకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని, గిరిజనుల పక్షాన తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి ఆదివారం ఆమె సాక్షితో ఫోన్‌లో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
చంద్రబాబుపై విమర్శలు
ఏజెన్సీలోని అపారమైన బాకై ్సట్ ఖనిజ సంపదను దోచుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు బాకై ్సట్ తవ్వకాలకు అనుకూలంగా జీవో నంబరు 97ను తెచ్చి గిరిజనులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల పక్షాన నిలబడి, బాకై ్సట్ వ్యతిరేక పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు.
చారిత్రాత్మక నిర్ణయం:
2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి బాకై ్సట్ జీవోనంబు 97ను రద్దు చేసి గిరిజనులకు అండగా నిలిచారన్నారు. ఆ చారిత్రాత్మక నిర్ణయం వల్ల ఏజెన్సీలో ఎంతోకాలంగా ఉన్న బాకై ్సట్ భూతం వదిలి, గిరిజనులు ప్రశాంతంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
ప్రతిఘటన తప్పదు
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అక్రమ సర్వేలతో గిరిజనులను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని ఎంపీ హెచ్చరించారు. గిరిజనులకు అన్యాయం చేసే చర్యలను ప్రభుత్వం విరమించుకోకపోతే, గిరిజనులతో కలిసి వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో పోరాడుతుందని, ప్రభుత్వం తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంపీ గుమ్మా తనూజరాణి స్పష్టం చేశారు.


