మారెమ్మ తల్లికి కంచు గంట బహూకరణ | - | Sakshi
Sakshi News home page

మారెమ్మ తల్లికి కంచు గంట బహూకరణ

Jun 22 2026 12:48 AM | Updated on Jun 22 2026 12:48 AM

అందజేసిన జెడ్పీ హైస్కూల్‌పూర్వ విద్యార్థులు

సీలేరు: స్థానిక గ్రామ దేవత శ్రీ మారెమ్మ అమ్మవారికి 1992–93 బ్యాచ్‌కు చెందిన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పూర్వ విద్యార్థులు కంచు గంటను బహూకరించారు. ఇటీవల అమ్మవారి జాతరకు వచ్చిన పూర్వ విద్యార్థులు, తమ వంతు సేవగా ఆలయానికి 20 కేజీల బరువున్న కంచు గంటను సమర్పిస్తామని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆదివారం ఆ గంటను ఆలయానికి తీసుకువచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వ విద్యార్థుల్లో ఒకరైన రామకృష్ణ దంపతులు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి, అనంతరం గంటను ఆలయ అర్చకులు దామోదర శర్మ, కమిటీ సభ్యులు కార్య శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement