మాడగడ వ్యూపాయింట్‌రహదారికి మోక్షం | - | Sakshi
Sakshi News home page

మాడగడ వ్యూపాయింట్‌రహదారికి మోక్షం

Jun 22 2026 12:48 AM | Updated on Jun 22 2026 12:48 AM

రూ.15 కోట్లతో రోడ్డు పనులు పూర్తి

అరకులోయ టౌన్‌ (పాడేరు రూరల్‌): :ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌కు వెళ్లే రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పర్యాటకులు, స్థానికుల సౌకర్యార్థం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బోసుబెడ్డ నుంచి మాడగడ మీదుగా పక్కనగుడ జంక్షన్‌ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర తారురోడ్డు, డ్రైనేజీ, కల్వర్టులు, సైడ్‌ వాల్‌ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులను మంజూరు చేసింది. అటవీశాఖ ఆంక్షల కారణంగా ఈ పనులు కొంతకాలం జాప్యానికి గురయ్యాయి. దీనివల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఈ రోడ్డు పనులు పూర్తి కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రహదారిలో ఇంకా కొంత భాగంలో పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తే పర్యాటకులకు మరింత సౌకర్యంగా ఉంటుందని స్థానిక గ్రామస్తులు, పర్యాటకులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement