సామూహిక షష్టిపూర్తిలో పూర్వ విద్యార్థులు
మాకవరపాలెం: పూర్వ విద్యార్థుల సామూహిక షష్టి వేడుక ఎంతో సందడిగా జరిగింది. స్థానిక ఉన్నత పాఠశాలలో చదివిన 1980–81 టెన్త్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక శ్రీకన్య ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా ఒకే వేదికపై కలుసుకుని 45 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులకు 60 ఏళ్లు పూర్తి కావడంతో సామూహిక షష్టి పూర్తి కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ సమ్మేళనంలో 60 మందికిపైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


