రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి

Jun 22 2026 12:48 AM | Updated on Jun 22 2026 12:48 AM

కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి చెందింది. సీఐ అల్లు స్వామినాయుడు ఆదివారం అందించిన వివరాల ప్రకారం..మునగపాక మండలం కుమార పురం గ్రామానికి చెందిన అగ్గాల కుమారి (20) ఆటోలో అనకాపల్లికి శనివారం వెళుతుండగా మార్గ మధ్యంలో ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆటో స్టీరింగ్‌ లాక్‌ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కుమారి త్రీవంగా గాయపడింది. ఆమెను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ శనివారం రాత్రి మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతురాలి చెల్లి గ్రేస్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సతీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ చెప్పారు. మృతురాలు కుమారి స్టాఫ్‌ నర్స్‌గా శిక్షణ పొందుతోందని, ఆమె తల్లిదండ్రులు అగ్గాల లక్ష్మి,సూరిబాబు, సోదరి ఉన్నారని సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement