పిడుగు పాటుకు పాడి ఆవు మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగు పాటుకు పాడి ఆవు మృతి

Jun 22 2026 12:48 AM | Updated on Jun 22 2026 12:48 AM

మృతి చెందిన పాడి ఆవు

మునగపాక:మండలంలోని మడకపాలెంలో శనివారం రాత్రి పిడుగుపడి ఓ పాడి ఆవు మృతి చెందింది. మడకపాలెంలో పశువులను మేపుకుంటూ రైతు రాయి కుమార్‌ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి ఎప్పటిలాగానే పశువులకు గడ్డి వేసి ఇంటికి చేరుకున్నాడు.రాత్రి కురిసిన వర్షంతో పాటు ఉరుములు,మెరువులతో కూడిన పిడుగులు పడ్డాయి. ఈ సంఘఽటనలో కుమార్‌కు చెందిన ఆవు మృతి చెందింది. ఆవు ఖరీదు రూ.లక్ష వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.తనకు న్యాయం జరిగేలా చూడాలని కుమార్‌ కోరాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement