రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడి మృతి

Jun 22 2026 12:48 AM | Updated on Jun 22 2026 12:48 AM

మాడుగుల రూరల్‌: మండలంలోని ఘాట్‌రోడ్డు జంక్షన్‌ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాగరం పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న సురవరం గ్రామానికి చెందిన వసంత కుమారస్వామి(40) ఘాట్‌రోడ్డు సమీపంలో సాగరం వైపు నడిచి వస్తుండగా, చోడవరం నుంచి పాడేరు వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన కుమారస్వామిని 108 వాహనంలో మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement