విద్యుత్‌ సామగ్రి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సామగ్రి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

నిందితులతో ఎస్‌ఐ తారకేశ్వరరావు

నాతవరం: విద్యుత్‌ వైర్ల కాయిల్స్‌ను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు శనివారం తెలిపారు. నర్సీపట్నం, తుని మధ్య గన్నవరం మెట్ట వద్ద వాహనాలు తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో వచ్చిన వి.బి.ఆగ్రహారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా 30 కిలోల విద్యుత్‌ కాయిల్స్‌ పట్టుబడినట్టు చెప్పారు. వీటిని ఎక్కడో దొంగిలించి తునిలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్టుగా విచారణలో తెలిందన్నారు. ఇలాంటి విద్యుత్‌ సామగ్రి కొనుగోలు, విక్రయాలు చట్టరీత్యా నేరమన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement