అనకాపల్లి: స్థానిక శారద బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి(70) మృతదేహం లభించినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి శనివారం తెలిపారు. నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడడంతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నట్టు చెప్పారు. మృతదేహం వద్ద గల బ్యాగ్‌మీద తమిళ అక్షరాలు ఉన్నాయని, బ్యాగ్‌లో పరిశీలించగా ఐదు కిలోల సన్నబియ్యం, ఎస్.ఎ.బాలమ్, అరంగనూర్, పాండిచ్చేరి అనే వివరాలు కనిపించాయని ఎస్‌ఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7382058996ను సంప్రదించాలన్నారు.


