మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజనుడి మృతి | - | Sakshi
Sakshi News home page

మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజనుడి మృతి

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ బొండ్రుగూడ గ్రామానికి చెందిన నరంజి అద్దు (45), చేపల వేటకు వెళ్లి మత్స్యగెడ్డలో గల్లంతై మృతి చెందాడు. శుక్రవారం గల్లంతైన అద్దు కోసం ఎస్‌ఐ నాని, ఎంపీటీసీ కమల, మాజీ సర్పంచ్‌ నీలకంఠం ఆధ్వర్యంలో అధికారులు, గ్రామస్తులు నాటు పడవలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు మృతదేహం లభ్యం కావడంతో, దానిని ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అద్దు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, రాజకీయ పార్టీల నేతలు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement