ఉద్యోగాలు ఇస్తామని మోసం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు ఇస్తామని మోసం

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

గిరిజన యువత ఆవేదన

సీలేరు: ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలోని భవ్య ఆస్పత్రిలో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని గిరిజన నిరుద్యోగ యువకులు ఆరోపించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న వాచ్‌మెన్‌ ఉద్యోగం కోసం తాము దరఖాస్తు చేసుకున్నామని, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పి, ఎవరికీ తెలియకుండా రహస్యంగా మరొకరిని నియమించారని వారు ఆరోపించారు. నిరుద్యోగులను మోసం చేయడం అధికారులకు పరిపాటిగా మారిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దరఖాస్తుదారులందరికీ పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement