న్యూస్‌రీల్
‘కారుమూరి’ అరెస్టు అప్రజాస్వామికం
కలెక్టర్ నిశాంతి
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026
గా
నేడు యోగాంధ్ర ముగింపు
● జేసీ తిరుమణి శ్రీపూజ
అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): స్థానిక (రవ్వలగుడ) ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించనున్న యోగాంధ్ర ముగింపు కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ శనివారం ఒక ప్రకటనలో కోరారు. కలెక్టర్ నిషాంతి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు ఉదయం 7.30 గంటలకు మైదానంలో అందుబాటులో ఉండాలని జేసీ సూచించారు.
గి
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని ప్రకృతి రమణీయతకు నిలయం డుడుమ జలపాతం. ఆ జలపాతం హోరు, కొండల గాలి, పచ్చని ప్రకృతి మధ్య ఒక అద్భుతం నిత్యం కనిపిస్తుంది. వంద ఏళ్లు దాటినా ఏమాత్రం తగ్గని ఉత్సాహంతో, ఎంతో చురుకుగా యోగాసనాలు వేస్తూ పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు ప్రధాన కాశీ విశ్వనాథం.
ఎవరీ యోగా వృద్ధుడు?
మండలంలోని వనుగుమ్మ పంచాయతీ, సంగడ గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథం నిత్య యోగా సాధకుడు. సాధారణంగా వృద్ధాప్యంలో నడవడానికి ఇబ్బంది పడే వయసులో, ఆయన గత 45 ఏళ్లుగా డుడుమ జలపాత పరిసరాల్లోనే ఉంటూ యోగా సాధన చేస్తున్నారు. 104 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆరోగ్యం, చురుకుదనం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రకృతి ప్రసాదించిన ఆహారమే ప్రాణం
ఆయన జీవనశైలి చాలా భిన్నమైనది. అడవిలో దొరికే దుంపలు, పండ్లు తింటూ, ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. ఎటువంటి కాలుష్యం లేని ఆహారం, నిరంతర యోగా సాధనే తన సుదీర్ఘ ఆరోగ్యకర జీవనానికి రహస్యమని ఆయన చెబుతారు.
పర్యాటకులకు ఆకర్షణగా..: డుడుమ సందర్శనకు వచ్చే పర్యాటకులు విశ్వనాథం చేస్తున్న యోగాసనాలను చూసి మంత్రముగ్ధులవుతుంటారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి, యోగా విశేషాలు తెలుసుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఒక వృద్ధుడు అంతటి క్రమశిక్షణతో యోగా చేయడం వారిలో ఎంతో స్ఫూర్తిని నింపుతోంది.
చింతపల్లి జీసీసీ డివిజనల్ మేనేజర్ బదిలీ
చింతపల్లి : స్థానిక జీసీసీ డివిజనల్ మేనేజర్ డి. సింహాచలంకు చింతూరు బదిలీ అయ్యింది. ఈయన చింతపల్లి డీఎంగా ఆరు నెలలుగా క్రితం విధుల్లో చేరారు. ఈయన స్థానంలో కొయ్యూరు జీసీసీ బ్రాంచ్ మేనేజర్ సరమండ విజయ్‌కుమార్‌ను పదోన్నతి కల్పిస్తూ నియమించారు.
వైఎస్సార్‌సీపీ యువవజన విభాగం
రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య


