విద్యావలంటీర్‌ను నియమిస్తాం | - | Sakshi
Sakshi News home page

విద్యావలంటీర్‌ను నియమిస్తాం

Jun 21 2026 12:31 AM | Updated on Jun 21 2026 12:31 AM

ఎంఈవో ిసింహాచలం

కొయ్యూరు: మండలంలోని కొండపై ఉన్న మూలపేట పంచాయతీ జాజులబంద ప్రాథమిక పాఠశాలను ఎంఈవో పి.సింహాచలం శనివారం సందర్శించారు. రహదారి లేని కారణంగా కొంత దూరం కాలినడకన పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల తల్లిదండ్రులు కలెక్టర్‌కు విన్నవించడంతో, ఎంఈవో స్వయంగా పాఠశాలను తనిఖీ చేశారు. త్వరలోనే ఉపాధ్యాయుడిని లేదా విద్యా వాలంటీర్‌ను నియమిస్తామని తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు పాఠాలు, డ్రిల్‌ చేయించారు. మండలంలోని ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు 35 మంది విద్యా వలంటీర్లను నియమించాలని కోరుతూ డీఈవోకు నివేదించామని ఎంఈవో తెలిపారు. జాజులబంధ పాఠశాల విషయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్య పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement