ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా పరిశీలన

Jun 19 2026 12:42 AM | Updated on Jun 19 2026 12:42 AM

పాడేరు : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే కాకుండా జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు సర్‌(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ దోహద పడుతుందని జిల్లా కలెక్టర్‌ నిశాంతి అన్నారు. పట్టణంలోని సుండ్రుపుట్టు గ్రామ సచివాలయ పరిధిలో ఇంటింటా ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియను గురువారం ఆమె పరిశీలించారు. మండల తహాశీల్ధార్‌, ఎన్నికల సిబ్బంది, బూత్‌ స్థాయి అధికారులతో కలిసి క్షేత స్థాయిలో ఇంటింటా వెళ్లి ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్‌ పత్రాలు తనిఖీ చేసి వాటిలోని ఓటర్ల వివరాలను అనుసంధానిన చాయాచిత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓటర్ల నమోదుకు పారదర్శకతను పాటించాలన్నారు. ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఆమె వెంట డీపీవో చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, బీఎల్‌వోలు, ఎన్నికల అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement