పశువైద్యాధికారులకు భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పశువైద్యాధికారులకు భద్రత కల్పించాలి

Jun 19 2026 12:42 AM | Updated on Jun 19 2026 12:42 AM

తుమ్మపాల: జిల్లాలో పశువైద్యాధికారులకు భద్రతకల్పించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా పశువైద్యాధికారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ పశువైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ విజయ్‌పై కొందరి వ్యక్తుల దాడి చేయడం దురదృష్టకరమన్నారు. అనంతరం జిల్లా పశుసంవర్ధక శాఖాధికారికి వినతిపత్రం సమర్పించి, విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు తగిన భద్రత కల్పించాలని కోరారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల సర్వీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాము బగాది , ప్రధాన కార్యదర్శి పి.సురేష్‌ కుమార్‌, కార్యవర్గ సభ్యులు, జిల్లా వ్యాప్తంగా వెటర్నరీ వైద్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement