కోటవురట్ల: ఆ గురువు ఆదర్శంగా నిలిచి పలువురి మన్ననలు పొందుతున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పడమే కాకుండా తన ఇద్దరు పిల్లలను తాను పనిచేస్తున్న పాఠశాలలోనే చేర్చి స్ఫూర్తిగా నిలిచారు. ఈ మేరకు పాములవాక జెడ్పీ హైస్కూల్‌లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు ఎం.చిట్టయ్యను సమగ్ర శిక్ష అభియాన్ ఏఎంవో కెజియా గురువారం ఘనంగా సత్కరించారు. మిగతా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుడు చిట్టయ్య మాట్లాడుతూ డీఈవో అప్పారావునాయుడు స్ఫూర్తితో తన పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానని తెలిపారు. హెచ్‌ఎం కె.వి.ఎల్.నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


