పలు రైళ్లు దారి మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్లు దారి మళ్లింపు

Jun 19 2026 12:42 AM | Updated on Jun 19 2026 12:42 AM

తాటిచెట్లపాలెం: సదరన్‌ రైల్వే, అరక్కోణం రైల్వేస్టేషన్‌ పరిధిలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా తేదీల్లో ఈ స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీన టాటానగర్‌–ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 23వ తేదీన విల్లుపురం–ఖరగ్‌పూర్‌(22604) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 24వ తేదీన తిరునల్వేలి–పురూలియా(22606) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 21వ తేదీన రాధికాపుర్‌–ఎస్‌ఎంవీటి బెంగళూరు (16224) ఎక్స్‌ప్రెస్‌లు మళ్లించబడిన మార్గంలో వయా గూడూరు, రేణిగుంట, తిరుత్తని, మెల్‌పక్కం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఆయా తేదీల్లో ఈ రైళ్లకు తిరుత్తని స్టేషన్‌లో అదనపు హాల్ట్‌ను కల్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement