పాయకరావుపేట: రుణాలను చెల్లించకపోవడంతో పట్టణంలోని సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ సంస్థ ఆస్తులను కెనరా బ్యాంకు జప్తు చేసింది. సంస్థ రుణ ఖాతాలు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వాటిని రెవెన్యూ అధికారులు గురువారం స్వాధీనం చేసుకుని బ్యాంకుకు అప్పగించినట్లు ఏఆర్‌ఎం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించి వేలం ప్రక్రియ ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వేణుగోపాలరెడ్డి, ఏఆర్‌ఎం సత్యనారాయణ, డివిజినల్ మేనేజర్ ధనుంజయరావు, పోలీసు సిబ్బంది, మండల రెవెన్యూ సిబ్బంది, తుని బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు.


