● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్
● పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు
అరకులోయ టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ నేతల కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను కూటమి ప్రభుత్వం సమర్థించడం సరికాదని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. రాధాకృష్ణపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఉదయం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మత్స్యలింగం స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ నాయకుల కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను రాధాకృష్ణ వెంటనే వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బుధవారం విశాఖలోని ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించినట్లే, భవిష్యత్తులో రాధాకృష్ణ ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. రాధాకృష్ణ తన మాటలను అదుపులో పెట్టుకోవాలని, పద్ధతి మార్చుకోకపోతే గిరిజన మహిళల తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, అరకులోయ, హుకుంపేట మండల పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, పాంగి అనిల్, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, నియోజకవర్గం బూత్ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు సందడి కొండబాబు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు కిరణ్ కుమార్, మాజీ సర్పంచ్‌లు కిముడు హరి, వెంకటపూర్ణిమ, సెంబి సన్యాశిరావు, రేగం రమేష్, గుడివాడ ప్రకాష్, కిల్లో జగన్, టి. వెంకటరావు, నాయకులు విజయదశమి, గుంజిడి ప్రసాద్, చిట్టిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.


