సాక్షి, పాడేరు: స్థానిక తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను కలెక్టర్ టి. నిశాంతి గురువారం తనిఖీ చేశారు. జిల్లాకు కేటాయించిన 1,07,581 జవాబు పత్రాలలో ఇప్పటివరకు 36,892 పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఈ ప్రక్రియను వేగంగా, విజయవంతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బృందాలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నెట్‌వర్క్ సమస్యలపై సమీక్ష
కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్/సెల్ టవర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.


