పన్నుల వసూళ్లలో జిల్లాకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం | - | Sakshi
Sakshi News home page

పన్నుల వసూళ్లలో జిల్లాకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

పాడేరు రూరల్‌: సమిష్టి కృషితోనే పన్నుల వసూళ్లలో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని డీపీవో పూర్ణచంద్రశేఖర్‌ తెలిపారు. ఈ ఘనత సాధించినందుకు గురువారం జిల్లా కార్యాలయంలో వివిధ మండలాల పీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు ఆయనను ఘనంగా సన్మానించారు.జిల్లాలోని 244 గ్రామ పంచాయతీలకు గాను 240 పంచాయతీల్లో నూరు శాతం పన్నులు వసూలయ్యాయని, ఇది ఒక రికార్డు అని డీపీవో పేర్కొన్నారు.ఈ విజయం తన ఒక్కరిది కాదని, జిల్లాలోని 3,461 ఆవాస ప్రాంతాల్లో నిరంతరం శ్రమించిన ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది అందరిదని ఆయన కొనియాడారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన సంబంధిత సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రమేష్‌, వివిధ మండలాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement