దారి తప్పిన భద్రత | - | Sakshi
Sakshi News home page

దారి తప్పిన భద్రత

Feb 17 2026 7:38 AM | Updated on Feb 17 2026 7:38 AM

దారి

దారి తప్పిన భద్రత

పాడేరు ఘాట్‌ రోడ్డులో నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎత్తయిన కొండలు, లోయలు, ప్రమాదకర మూల మలుపులతో ఇరుగ్గా ఉండే ఈ రోడ్డులో ప్రయా ణమంటేనే జిల్లా వాసులు హడలిపోతున్నారు. అధికారులు సరైన భద్రతా చర్యలు తీసు కోకపోవడంతో ప్రయాణికులు భయం భయంగా రాకపోకలు సాగించవలసి వస్తోంది.

సాక్షి,పాడేరు: జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు ఏటా లక్షల్లో సందర్శకులు వస్తారు.పాడేరు జిల్లా కేంద్రంగా మారడంతో ఈ మార్గంలో రాకపోకలు పెరిగాయి. వందల సంఖ్యలో వచ్చిపోయే వాహనాల్లో ఏ ఒక్కటి మొరాయించినా ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. పెరుగుతున్న రద్దీకి తగ్గట్టుగా ఘాట్‌రోడ్డులో భద్రత కొరవడుతోంది. చాలా చోట్ల రక్షణ గోడలు లేవు. దెబ్బతిన్నవాటిని పట్టించుకున్న నాథుడే కరయ్యాడు. జింగిల్‌ క్లియరెన్స్‌ జరగడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి

రక్షణ గోడల నిర్మాణంలో నిర్లక్ష్యం

25 కిలోమీటర్ల పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రమాదకర మలుపులు వద్ద రక్షణ గోడలు కరువయ్యాయి. పలు చోట్ల రక్షణ గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.వ్యూపాయింట్‌ సమీపంలో రెండేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకుపోయిన ప్రాంతంలో రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడ రక్షణ గోడను నిర్మించపోవడంతో వాహన చోదకులు భయపడుతున్నారు. ఏమాత్రం అదుపుతప్పినా వాహనాలు లోయలోకి దూసుకుపోవడం ఖాయం. నాలుగు నెలల క్రితం కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలోను రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమైంది.అక్కడ కూడా కొత్త గోడ నిర్మించకపోవడంతో ప్రమాదాలను ఆహ్వానిస్తోంది. ఘాట్‌రోడ్డులో చాలా చోట్ల మలుపుల వద్ద రక్షణ గోడల పరిస్థితి దయనీయంగా ఉంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వాహన చోదకులు, ప్రయాణికులు, పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తుప్పలు,డొంకల తొలగింపులోనూ ..

పాడేరు ఘాట్‌రోడ్డులో ఏసుప్రభువు విగ్రహం ఉన్న మలుపు నుంచి ఘాట్‌ రోడ్డు పూర్తయ్యే వరకు జంగిల్‌ క్లియరెన్స్‌ పనుల్లోను తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది.రోడ్డుకు ఇరువైపులా తుప్పలు.డొంకలు బాగా పెరగడంతో మలుపుల వద్ద వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఉంది. దీంతో చోదకుల భయపడుతునే వాహనాలను నడుపుతున్నారు.

గోతుల మయం..

ఘాట్‌రోడ్డులో పలుచోట్ల గోతులు ఏర్పడ్డాయి.మోదకొండమ్మతల్లి పాదాలు గుడి నుంచి ఓనురు జంక్షన్‌ వరకు రోడ్డు పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. పలుసార్లు క్రసర్‌ బుగ్గితో తాత్కాలికంగా గోతులను పూడ్చినప్పటికీ మళ్లీ రోడ్డు అధ్వానంగా మారింది.పూర్తిస్థాయిలో గోతుల పూడ్చివేతకు ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై వాహన చోదకులు,ప్రయాణికులు మండిపడుతున్నారు.

ఘాట్‌రోడ్డులో ప్రయాణం భయం...భయం

దారి తప్పిన భద్రత1
1/2

దారి తప్పిన భద్రత

దారి తప్పిన భద్రత2
2/2

దారి తప్పిన భద్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement