బాకై ్సట్ ఊసెత్తితే బాణాలతో తరిమికొడతాం
సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల్లో బాకై ్సట్ తవ్వకాల ఊసెత్తితే గిరిజనులతో కలిసి సంప్రదాయ బాణాలతో తరిమికొడతామని వైఎస్సార్‌సీపీజిల్లా అధ్యక్షుడు,పా డేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించా రు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం బాకై ్సట్ సంపదను దోచుకునేందుకు కుట్రపన్నిందని, సీఎం చంద్రబాబు బాక్సైట్ న దోచుకోవడమే లక్ష్యంగా జీవోనంబర్ 97ను జారీ చేసి, గిరిజనులకు అన్యాయం చేసే చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. ఆసమయంలో ప్రతిపక్ష నేత హోదా లో తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాకై ్సట్ వ్యతిరేక పోరాటానికి మద్దతునిచ్చి, చింతపల్లిలో గిరిజనులతో కలిసి ఉద్యమం చేశారని తెలిపారు. 2019ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, అధికారంలోకి రాగానే గిరిజనులకు ఇచ్చిన మాట మేరకు సీఎం హోదాలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాకై ్సట్ అనుకూల జీవో 97ను రద్దు చేసి గిరిజనుల సంపదకు రక్షకుడిగా మారారని ఆయన గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు బాకై ్సట్‌ను తవ్వుకునే కుట్రలకు పాల్పడడం అన్యాయమన్నారు. అనంతగిరి, అరకులోయ, చింతపల్లి, జీకే వీఽధి, గుర్తెడు ప్రాంతాల్లోని నిక్షిప్తమైన 615 మిలియన్ టన్నుల బాకై ్సట్ సంపదను దోచుకోవడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాకై ్సట్ తవ్వకాలకు అడ్డువస్తున్నారనే ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను అణిచి వేస్తున్నారని, అయితే ఆదివాసీలను మాత్రం అంతం చేయలేరన్నా రు. గిరిజన సంపదను దోచుకోడానికి యత్నిస్తే ఆదివాసీలంతా అల్లూరి సీతారామారాజు వలే మహోన్నత పోరాటం చేస్తారని చెప్పారు. కూటమి నేతలకు ఓటుతోనే గిరిజనులమంతా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గిరిజన వ్యతిరేక విధానాల వల్లే చంద్రబాబును గిరిజనులు నమ్మడం లేదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గిరిజనులంతా వైఎస్సార్‌సీపీకే పట్టం కడుతున్నారన్నారని తెలిపారు. జిల్లాలోఖనిజాల తవ్వకాలకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


