గంజాయి కేసులో నలుగురు అరెస్ట్
అచ్యుతాపురం రూరల్ : గంజాయి కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతాంలో వెదురువాడ సాయి ప్రియా లేఅవుట్‌లో గంజాయి సేవించడానికి సిద్ధంగా ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. చందక గోపి, చందా దాసు, గంట్యాడ దినేష్, నేల్ల నవీన్ అనే వ్యక్తులను విచారించగా ఇప్పటికే పలుమార్లు దొంగతనాలు, గంజాయి, కొట్లాట కేసుల్లో అరెస్ట్ కాబడినట్టు తేలిందన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వారిలో సిబ్బంది బంగార్రాజు, ఇల్లా శ్రీను తదితరులు ఉన్నారు.


