
● స్నేహ పరిమళం
నేడు స్నేహితుల దినోత్సవం
గిరిజన తండాల్లో ఒకరు మరొకరిని నేస్తం అని పిలిస్తే, ఆ స్నేహం తరతరాలు కొనసాగుతుంది. కష్టంలో తోడుగా నిలబడటం, ఒకరికొకరు అండగా ఉండటం, అవసరమైతే ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడరు. ఈ పవిత్రమైన స్నేహ బంధం గిరిజనుల జీవితంలో భాగమైంది. అడవిలో కలిసి వేటాడటం, పండుగలు, శుభకార్యాల్లో కలిసి పాల్గొనడం వంటివి ఈ స్నేహాన్ని మరింత బలపరుస్తున్నాయి. మన్యంలో గిరిజనులకు స్నేహం అనేది ఒక జీవన విధానం. ఒక గ్రామంలో ఒక కుటుంబానికి కష్టం వస్తే, చుట్టుపక్కల గ్రామాల్లోని నేస్తాలు అందరూ కలిసి సహాయం చేస్తారు. ఇవి కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల ద్వారా గిరిజనులు ఒకరికొకరు రక్షణ కవచంలా నిలుస్తారు. ఏడాది లేక ఐదేళ్లకొకసారి తమ సమీప గ్రామాల్లో గిరిజనులను తమ గ్రామానికి ఆహ్వానించి నేస్తం పండుగను ఘనంగా నిర్వహిస్తారు. – ముంచంగిపుట్టు