
అనకొండ
● నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ ● గ్రామంలో ఇళ్లు బీటలు వారుతున్నా పట్టించుకోని వైనం ● రోజుకు 50 టిప్పర్ల కంకర తరలింపు ● కరిగిపోతున్న నరసాపురం కొండ ● చోద్యం చూస్తున్న అధికారులు
అనుమతులు లేకుండా..
కంకర తవ్వకాలకు సరైన అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటవీశాఖ, పోలీస్, ఫైర్ శాఖల నుంచి అనుమతి పొందలేదని, పర్యావరణ అనుమతులు కూడా లేవని వారు చెప్పారు.
రంపచోడవరం: మండలంలోని నరసాపురం సమీపంలో మైనింగ్ దందా భారీగా సాగుతోంది. బాపనమ్మ సొసైటీ, గిరిజన మహిళ పేరుతో నింబంధనలకు విరుద్ధంగా రెండు క్వారీలను నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులు స్పందించడం లేదు. కనీసం తాత్కాలికంగా నైనా క్వారీలను నిలుపుదల చేయలేదు. అధికారుల మధ్య సమన్వయం లోపం మైనింగ్ మాఫియాకు కలిసివచ్చింది. క్వారీలో రాయిని బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేసేందుకు పోలీస్, ఫైర్ శాఖల నుంచి అనుమతులు ఉండాలి. కాని ఎటువంటి అనుమతులు పొందలేదు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో బడా కాంట్రాక్ట్ యథేచ్ఛగా రెంరెండు చోట్ల తవ్వకాలు జరుపుతున్నాడు. పర్యావ రణ అనుమతులు కూడా లేకుండా విచ్చలవిడిగా కొండను పేల్చి, కంకరను తరలిస్తున్నాడు. టిప్పర్ కంకర రూ.16 వేల వరకూ విక్రయిస్తున్నాడు. ఇలా రోజూ 50 ట్రిప్పర్లద్వారాతరలించి,అమ్ముతున్నాడు.
ముసురుమిల్లి ప్రాజెక్టు కోసం..
ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులకు కావలసిన రాళ్లకోసం 2006 సంవత్సరంలో నరసాపురం వద్ద ఐదు ఎకరాల్లో క్వారీ నిర్వహణకు అను మతులు ఇచ్చారు. గ్రామస్తులు సొసైటీగా ఏర్పడి క్వారీ నిర్వహించారు. ముసురుమిల్లి కాలువ పను లు పూర్తయిన తరువాత కొంత కాలం క్వారీ నిర్వహించారు. అక్కడ నిర్వహించిన బ్లాస్టింగ్‌ల వల్ల నరసాపురంలో ఇళ్లు బీటలు వారుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేయడంతో క్వారీని కొంత కాలం మూసివేశారు. అనంతరం అడ్డతీగల మండ ల దుప్పిలపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళకు ఐదు ఎకరాల్లో క్వారీ నిర్వహణకు అనుమతులు ఇచ్చారు. అయితే నిబంధనలు ప్రకారం ఎంసీ ఫిల్డ్ ల్యాండ్ (ఆ భూమి గ్రామానికి, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడాలి)ను ఒక్క మహిళకు ఇచ్చే అవకాశం లేదు. రెవెన్యూ శాఖ తప్పుడు పద్ధతిలో ఎన్‌వోసీ ఇవ్వడం వల్ల మైనింగ్ శాఖ త్వవకాలకు అనుమతులు ఇచ్చింది. ఆ మహిళ పేరుతో కాంట్రాక్టర్ క్వారీ నిర్వహిస్తున్నట్టు సమాచారం. 2018 సంవత్సరంలోనే ఎటువంటి అనుమతులు లేకుండానే క్వారీని తవ్వడం ప్రారంభించారు. ఆ తరువాత తప్పుడు పద్ధతిలో అనుమతులు పొందారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కుంజా శ్రీను జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
క్వారీ పక్కనే ఆరు ఎకరాల భూమి ఉంది
నరసాపురం సమీపంలోని క్వారీ పక్కనే సర్వే నంబర్ 81లో ఆరు ఎకరాల భూమి ఉంది. క్వారీ ఏర్పాటుకు రైతుల నుంచి ఎటువంటి అభిప్రాయాలు తీసుకోలేదు. క్వారీ నుంచి వచ్చే బూడిద వల్ల భూమి నిరుపయోగంగా మారింది. చట్టం ప్రకారం గ్రామసభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకుని క్వారీ నిర్వహించాల్సి ఉంది.
–కోసం రామన్నదొర, నరసాపురం

అనకొండ

అనకొండ

అనకొండ

అనకొండ