
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
పాడేరు: అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం పాడేరు కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 25 నాటికి కొత్త రేషన్ కార్డులను అందజేస్తామని చెప్పారు. ఏజెన్సీలో మరిన్ని సెల్ టవర్లు అందుబాటులోకి తెస్తామన్నారు.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, జీసీసీ ఎండీ కల్పన కుమారి, కలెక్టర్ దినేష్‌కుమార్, జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వర్చువల్‌గా రంపచోడవరం, చింతూ రు ఐటీడీఏ పీవోలు కట్టా సింహాచలం, అపూర్వ భర త్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పన శ్రీ పాల్గొన్నారు.
సమన్వయంతో సరుకుల పంపిణీ
అరకులోయ టౌన్: పౌరసరఫరాల శాఖ, జీసీసీ సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా గల రేషన్ డిపోల్లో నిత్యావసర సరకులతోపాటు జీసీసీ ఉత్పత్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం అరకులోయలో విలేకరులతో మాట్లాడారు. తెల్లకార్డు రేషన్‌దారులకు పౌరసరఫరాలశాఖ, గిరిజన సహకార సంస్థ(జీసీసీ)తో కలిసి ప్రభుత్వం అందిస్తున్న బియ్యం,కందిపప్పు,పంచదారతో పాటు ఇతర నిత్యావసర సరుకులైన సబ్బులు,గిరిజన ఉత్పత్తులు, నూనె వంటివి అన్ని డిపోల ద్వారా పంపిణీకి జీసీసీతో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు.సబ్బులు, పసుపు తదితర జీసీసీ ఉత్పత్తులను రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు అందించేందుకు వీలుగా జీసీసీ ఎండీతో చర్చిస్తున్నామన్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్