
కూటమి మోసాలను ఎండగట్టాలి
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
గూడెంకొత్తవీధి: కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను గ్రామ గ్రామాన ఎండగట్టాలని పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏ హామీని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.మండల కేంద్రం గూడెంకొత్తవీధిలో సోమవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. చంద్రబాబు కార్యక్రమాలకు జనాలు రావడం లేదని, అదే జగన్‌మోహన్‌రెడ్డి సభలకు ఎన్ని ఆంక్షలు పెట్టినా వేలాదిగా ప్రజలు వస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలు నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల ఆదరణ పెరగడంతో దానిని చూసి తట్టుకోలేక వైఎస్సార్ సీసీ కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు.ఇలాంటి సమయంలో కార్యకర్తలు ధైర్యంగా ఉండి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సందర్భంగా క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి, పార్టీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్,వైస్ ఎంపీపీ లోతా దేముడు,రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, సర్పంచ్ కొర్రా సుభద్ర, ఎంపీటీసీ కొర్రా రాజులమ్మ,రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, కొయ్యూరు మండల అధ్యక్షుడు బిడిజన అప్పారావు,సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కుందేరి రామకృష్ణ,మాజీ జెడ్పీటీసీ మత్స్యరాజు,క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు తిమోతి,రైతు విభాగం నియోజకవర్గ ఽ అధ్యక్షుడు కంకిపాటి రామారావు, ఉపాధ్యక్షుడు వరుణ్‌కుమార్,మండల కార్యదర్శులు చంటిబాబు,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కూటమి మోసాలను ఎండగట్టాలి