
అన్నదాతలకు అన్యాయం చేసిన చంద్రబాబు
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయటౌన్: రాష్ట్రంలో అన్నదాతలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20వేలు ఇస్తానని నమ్మించి, తీరా అధికారం చేజిక్కుంచుకున్న తరువాత రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. చిన్నచిన్న కారణాలు చూపించి పథకం వర్తింపచేయకుండా మోసం చేస్తున్నారని చెప్పారు. కేంద్రం అందించే సాయం రూ.6వేలు కాకుండా తామే రైతుకు రూ. 20వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తరువాత మాటమార్చారని ఆరోపించారు. ఇక గిరిరైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు. అన్నదాతలు కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే హెచ్చరించారు.