
పెట్టుబడి సాయం సద్వినియోగం చేసుకోండి
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఐటీడీఏ సమవేశ మందిరంలో పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత పెట్టుబడి సాయం చెక్కును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని 1,44,222 మంది రైతులకు పెట్టుబడి సాయం రూ.101కోట్ల 84లక్షలు విడుదల అయిందన్నారు. డబ్బులు జమ కాని రైతులు ఆందోళన చెందవద్దని, 155251 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలన్నారు. కొందరు రైతులకు ఆధార్ నంబర్‌లో సమస్యలు ఉన్నందున డబ్బు జమ కాలేదన్నారు. లబ్ధిదారులు సంబందిత గ్రామ సచివాలయాల్లో సరి చేసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జీ పీవో అభిషేక్
మిగతా 8వ పేజీలో