
సారా స్వాధీనం
హుకుంపేట: గ్రామల్లో సారా విక్రయాలు, తయారీ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సన్యాసినాయుడు,ఎకై ్సజ్ సీఐ టి.వి.వి.ఎస్.ఆచార్య చెప్పారు. మండలంలోని తీగలవలస పంచాయతీ రాతులపుట్టు గ్రామంలో ఎకై ్సజ్ శాఖ,స్థానిక పోలీస్‌లు సంయుక్తంగా శుక్రవారం సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 5వేల లీటర్లు సారా, పులుపు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామల్లో సారా తయారీలు, విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌ఐ సూర్యనారయణ తదితరులు పాల్గొన్నారు.