
బాబు పాలనలో మోసం గ్యారంటీ
అరకులోయటౌన్: బాబు పాలనలో గిరిజనులకు మోసం గ్యారంటీగా జరుగుతుందని, అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించి, అధికార పీఠంలో కూర్చున్న తరువాత వాటి అమలుకు కుంటి సాకులు చెడబుతున్నారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని చినలబుడు పంచాయతీ మంజగుడ గ్రామంలో ఎమ్మెల్యే మత్స్యలింగం శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు జగనన్న ప్రభుత్వ పాలనలో కరోన కష్టకాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఇంటింటికి వలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అందించారన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఆడ బిడ్డ నిధి కింద ప్రతీ నెల రూ.1500, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20వేలు, నిరుద్యోగులకు నెలకు నిరుద్యోగ భృతి రూ.3వేలు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి వాటిని అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక, రెడ్‌బుక్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ధి చెబుతారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను గ్రామస్తులకు వివరించాలన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంపై గిరిజనులకు అవగాహాన కల్పించి, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయంచి బాబు మోసాలను వీడియో రూపంలో వివరించారు. పార్టీ పంచాయతీ కమిటీ ఎన్నికను ఆయన పర్యవేక్షించారు.
కమిటీ వివరాలు
చినలబుడు పంచాయతీ కమిటీ అధ్యక్షుడిగా గొల్లోరి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శులుగా పాంగి కుమోన్, గొల్లోరి జగన్నాథం, నరసింగరావు, కిల్లో రఘురామ్, ఇరగాయి పంచాయతీ అధ్యక్షుడిగా మాదాల రామారావు, ప్రధాన కార్యదర్శులుగా గడబంటు భాస్కర్‌రావు, బురిడి విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, తామల అప్పారావు, కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, సర్పంచ్ పెట్టెలి సుస్మిత, ఎంపీటీసీ సభ్యులు గరం సీత, దురియా ఆనంద్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు పల్టాసింగ్ విజయ్‌కుమార్, బూత్ కమిటి ఇంచార్జీ పాంగి విజయ్, నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సుక్రయ్య, ఉప సర్పంచ్ హరి, వార్డు సభ్యులు వీరన్న, సోమన్న, సీనియర్ నాయకుడు గరం పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

బాబు పాలనలో మోసం గ్యారంటీ