
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
గంగవరం : గంగవరం, చిన్నఅడ్డపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. శుక్రవారం గంగవరం– అడ్డతీగల జాతీయ రహదారిపై ఈ ప్రమాదాలు జరిగాయి. చిన్న అడ్డపల్లి వద్ద బైక్, బైక్ ఎదురు ఎదురుగా ఢీకొట్టడంతో గంగవరం గ్రామానికి చెందిన కురసం వెంకన్నదొర (35) అనే వ్యక్తికి, గంగవరం మండలం టేకుల గ్రామానికి చెంది ఒక మహిళకు తీవ్ర గాయాలైయ్యాయి. వెంకన్నదొర తలకు తీవ్ర గాయం కాగా, మహిళకు ఓ చేయి విరిగి గాయమైంది. వారిని రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు/. గంగవరం పోలీసు స్టేషన్ సమీపంలో జరిగిన మరో మైక్ ప్రమాదంలో కోరుకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురుని రంపచోడవరం ఆస్పత్రికి స్థానికులు తరలించారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు