
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు
సాక్షి,పాడేరు: పట్టణంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం సాయంత్రం సాముహిక వరలక్ష్మితల్లి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకుడు రామం ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి రమాదేవి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, వైదేహి, ఇతర ప్రతినిధులు కొట్టగుళ్లి రామారావు, కొమ్మోజు వెంకటరమణ, సిద్దనాతి కొండలరావు, వంతిన్బ రాజబాబు, కిముడు ప్రభాకరరావు, దేశిది బాబురావు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు.